Indira Arts Entertainmentz

Indira Arts Entertainmentz
0 0
MAKE AN ENQUIRY
SEND
SHARE WITH OTHERS
See new updates

Latest Updates

మహేష్ కీ ఆ ఆలోచన ఉందా?

ఒక మంచి సినిమా వచ్చిందని తెలిస్తే చాలు. తప్పకుండా చూస్తాడు మహేష్. చూడటమే కాదు.. ఆ చిత్రబృందాన్ని కూడా అభినందిస్తుంటాడు. ఊపిరి చూశాక కూడా మహేష్ వెంటనే స్పందించాడు. ట్వీట్ చేసి చిత్రబృందాన్ని అభినందించాడు. అంతటితో ఆగకుండా నాగార్జునకి ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడట. ఆ విషయాన్ని నాగార్జున ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఇక నుంచి మేమేం చూపించాలి అన్నాడంటూ మహేష్ చెప్పిన మాటల్ని కూడా నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో బయటపెట్టాడు నాగ్. అయితే మహేష్ అన్న ఆ మాటలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మహేష్ కూడా నాగ్ లాగే ఇమేజ్ ని వదిలిపెట్టి సినిమాలు చేయాలనుకుంటున్నాడేమో అన్న సంకేతం ఆ మాటల్లో వ్యక్తమవుతోంది.

అసలు మహేష్ ఇమేజ్ వేరు నాగ్ ఇమేజ్ వేరు. నాగార్జున మొదట్నుంచీ వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అందుకే ఆయనకి విలక్షణమైన నటుడిగా పేరుంది. మహేష్ మాత్రం మొదట్నుంచీ మాస్ మంత్రమే జపిస్తున్నాడు. కానీ రెండు మూడేళ్లుగా మహేష్ ఆలోచనల్లోనూ మార్పొచ్చినట్టు స్పష్టమవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - శ్రీమంతుడులాంటి సినిమాల్లో మహేష్ తరహా మాస్ అంశాలేమీ ఉండవు. కానీ మహేష్ మాత్రం ఆ విషయాన్ని పక్కనపెట్టి ఆయా సినిమాలు చేశాడు. విజయాల్ని అందుకొన్నాడు. ఇప్పుడు మరో మెట్టు కూడా దిగి మరిన్ని కొత్త ప్రయోగాలు చేయాలన్న ఆలోచనలో మహేష్ ఉన్నట్టు తెలిసింది. అందుకే నాగ్ వీల్ ఛెయిర్ లో కూర్చున్న పాత్రని చూసి `అన్నీ నువ్వే చేసేస్తే ఇక మేమేం చూపించాలి` అన్నాడనేది అర్థమవుతోంది. అంటే మహేష్ మనసులో కూడా అలాంటి పాత్రలొస్తే అస్సలు వదలకూడదన్న అభిప్రాయం ఉందనే విషయం అర్థమవుతోంది.

   Over a month ago
SEND

అలా చేస్తే చెంపదెబ్బలు తగిలేవి: నాగ్!

‘ఇమేజ్ ను నమ్ముకొని సినిమా చేసిన ప్రతిసారీ చెంప దెబ్బలే తినాల్సి వచ్చింది. ఇమేజ్ ను నమ్ముకొని సినిమాలు చేస్తే చేసిన కథలే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. నా కథలు నాకే బోర్ కొట్టేవి. ఇప్పుడు నా ప్రయాణం చాలా బాగుంది' అన్నారు నాగార్జున. నాగ్ తాజా చిత్రం ‘ఊపిరి’ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్.. 'ఏంతో ప్రేమతో ఈ సినిమా చేశామని సెట్లో ఉన్నప్పుడే ఈ సినిమా ట్రెండ్ ను సృష్టించేలా కాకుండా నా జీవితాన్ని మార్చేసే సినిమా అవుతుందని భావించానని ఇప్పుడదే నిజమైందని చెప్పారు. సినిమాలో ప్రతి సీన్ రియలిస్టిక్ గా ఉంటుంది. రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ప్రతి సీన్ గురించి మాట్లాడుతుంటే నెక్స్ట్ సినిమా మీతోనే ఉంటుంది సర్ అని చెప్పగానే ఫోన్ పెట్టేసి లోకేషన్స్ వెతుక్కోవాడానికి వెళ్ళారు. సినిమా చూసిన కొందరు కార్తి రోల్ మీకంటే ఎక్కువుందని చెప్పారు. ఎవరి రోల్ ఎక్కువ ఉందని ఆలోచించి సినిమా చేయలేదు. కార్తి నాకు తమ్ముడు లాంటి వాడు. ఇంతటి విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు' నాగ్.

   Over a month ago
SEND

ఊపిరికి ఊపు పెరుగుతోంది!!

నాగార్జున కార్తి హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి.. సక్సెస్ పుల్ టాక్ తో దూసుకుపోతోంది. ఊహించినట్లుగానే మల్టీప్లెక్స్ ఏ క్లాస్ సెంటర్లలో తిరుగులేని టాక్ సొంతం చేసుకుంది. బీ సీ సెంటర్లలో కూడా ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో అయితే.. బ్లాక్ బస్టర్ కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది ఊపిరి.

గురువారం ప్రివ్యూ షోలతో 76635 డాలర్లు రాగా శుక్రవారం రోజున 210233 డాలర్లు వసూలయ్యాయి. ఇక శనివారమైతే అత్యధికంగా 359405 డాలర్ల కలెక్షన్స్ రావడం విశేషం. మొత్తం కలిపి తొలి మూడు రోజుల్లో 646273 డాలర్లను రాబట్టగలిగింది ఊపిరి. మూడ్రోజుల వసూళ్ల మొత్తాన్ని మన కరెన్సీలో అయి 4.32 కోట్లుగా చెప్పచ్చు. సెకండ్ వీకెండ్ నాటికి మిలియన్ డాలర్స్ మూవీగా అతరిస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు కలెక్షన్స్ పెరుగుతున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆదివారం ఈ అన్ని మొత్తాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టగలిగిందని అంటున్నారు.

ఈ స్థాయిలో వసూళ్లలో పెరుగుదల బాలీవుడ్ భారీ చిత్రాలకు కూడా సాధ్యం కాదనే విషయం స్పష్టమే. మరోవైపు శనివారం వరకూ వచ్చిన కలెక్షన్స్ తోనే యూఎస్ బాక్సాఫీస్ లో 11 వ స్థానంలో నిలిచిన ఈ చిత్రం.. త్వరలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

   Over a month ago
SEND

National Film Awards 2015 : List of winners

The 63rd National Film Awards have been announced by the jury in New Delhi just a while ago. For the first time in the history of Telugu Cinema, Baahubali The Beginning won the Best Feature Film Award.
Here is the complete list of winners :
Best Feature Film : Baahubali The Beginning
Best Director : Sanjay Leela Bhansali (Bajirao Mastani)
Best Actor : Amitabh Bachchan (Piku)
Best Actress : Kangana Ranaut (Tanu Weds Manu Returns)
Best Supporting Actor : Samudra Kani (Visaranai)
Best Supporting Actress : Tanvi Azmi (Bajirao Mstani)
Best Child Artist : Gaurav Menon (Ben)
Best Special Effects : Baahubali
Best Lyrics : Varun Grover (Dum Laga Ke Haisha)
Best Choreography : Remo D’Souza (Bajirao Mastani)
Best Editing : Late T E Kishore (Vissaaranai)
Best Background Score : Illayaraja (Tharai Thapattai)
Best Cinematography : Sudeep Chatterjee (Bajirao Mastani)
Best Male Playback Singer : Mahesh Kale (Katyar Kaljat Ghusali)
Best Female Playback Singer : Monali Thakur (Dum Laga Ke Haisha – Moh Moh Kedage)
Best Screenplay (Original) : Juhi Chaturvedi (Piku), Himanshu Sharma (Tanu Weds Manu Returns)
Best Screenplay (Adapted) : Talwar (Vishal Bharadwaj)
Best Music Direction (Songs) : M. Jayachandran (Ennu Ninte Moideen)
Best Debut Film of A Director : Masaan
Best Popular Film Providing Wholesome Entertainment : Bajrangi Bhaijan
Best Children’s Film : Duronto
Regional Awards :
Best Feature Film in Telugu : Kanche
Best Feature Film in Tamil : Visaaranai
Best Feature Film in Hindi : Dum Laga Ke Haisha
Best Feature Film in Kannada : Thithi
Best Feature Film in Malayalam : Pathemari
Best Feature Film in Assamese : Kothanodi
Best Feature Film in Odiya : Pahada Ra Luha

   Over a month ago
SEND